మొరాయించిన టీటీడీ సర్వర్లు

by Hamsa |
మొరాయించిన టీటీడీ సర్వర్లు
X

దిశ, ఏపీ బ్యూరో : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజులపాటు వైకుంఠద్వారాలు తెరవాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దర్శనం టిక్కెట్ల కోటాను పూర్తిగా ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించనుంది. వైకుంఠద్వార దర్శనం నుంచి ప్రతి రోజు 20 వేల మంది భక్తులను అనుమతిస్తారు. ఇలా పది రోజులకు సంబంధించి 2 లక్షల టిక్కెట్లను టీటీడీ అధికారులు ఆన్‌లైన్‌లో పెట్టారు. శుక్రవారం ఉదయం 2 లక్షల టిక్కెట్లను అందుబాటులో ఉంచినా సర్వర్లు మొరాయించాయి.

టిక్కెట్లు విడుదల చేసిన అరగంటలోనే ఏకాదశి, ద్వాదశి పర్వదినాల టిక్కెట్ల కోటా పూర్తయింది. మిగిలిన రోజుల టిక్కెట్ల కోసం లక్షలాదిగా భక్తులు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో సర్వర్లు తెరుచుకోలేదు. సర్వర్‌ను త్వరలోనే పునరిద్ధరిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా టిక్కెట్లు విడుదల చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story