పాలక మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు

by srinivas |   ( Updated:2021-02-27 05:27:52.0  )
పాలక మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయాలు
X

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ బడ్జెట్‌కు పాలక మండలి ఆమోదం తెలిపింది. రూ. 2,937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌‌ను ఆమోదించారు. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని టీటీడీ చైర్మన్ తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రథసప్తమి వాహన సేవలను వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు. తిరుచానూర్ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహిస్తామని చెప్పారు. దేశంలోని అన్ని కళ్యాణ మండపాలను అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. టీటీడీ వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేరు మార్పు చేస్తామని అన్నారు. బర్డ్ ఆస్పత్రి పాత భవనంలో పిల్లల ఆస్పత్రి ఏర్పాటుకు రూ.8 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. అయోధ్య శ్రీ వారి ఆలయానికి భూమి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed