- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్టిఫిషియల్ లింబ్ తో దివ్యాంగులకు ఆత్మస్థైర్యం

దిశ, హిమాయత్ నగర్ : దివ్యాంగులకు నారాయణ సేవ సంస్థాన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఆర్టిఫిషియల్ లింబ్ తో దివ్యాంగుల మానసిక, ఆత్మస్థైర్యం పెంపొంది, వికలాంగులనే భావన తొలిగిపోతుందని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో మినర్వ గార్డెన్ లో ఆదివారం ఉచిత ఆపరేషన్ ఎంపిక, కృత్రిమ అవయవాలు, కాలిఫర్ కొలత శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగుల కోసం నారాయణ్ సేవా సంస్థాన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రమాదాలు, అనారోగ్యం, పోలియో కారణంగానో వికలాంగులుగా మారిన ఈ శిబిరంలోని వికలాంగులను కలవడం తీవ్రంగా కదిలించిందన్నారు. ఈ వికలాంగులకు సహాయం చేయడం, వారిని స్వావలంబనగా మార్చడం ఒక అద్భుతమైన సేవ అన్నారు. శిబిరంలో దాదాపు 1200 మంది వికలాంగులు నమోదు చేసుకున్నారు. ఎంపిక చేయబడిన వ్యక్తులందరూ దాదాపు రెండు నెలల్లో అధిక-నాణ్యత మాడ్యులర్ కృత్రిమ ఆవయవాలను అందుకుంటారు. ఈ శిబిరంలో సంస్థాన్ డైరెక్టర్, దేవేంద్ర చౌబిసా, ట్రస్టీ ప్రభాకర్ సంస్థాన్ పీఆర్ఓ భగవాన్ ప్రసాద్, ఆల్ ఇండియా మహాసభ తెలంగాణ ప్రెసిడెంట్మహేష్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు.