- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మా జ్ఞాపకాలు ప్రత్యేకమైనవి.. రోహిత్‌తో అనుబంధాన్ని పంచుకున్న కోహ్లీ

దిశ, స్పోర్ట్స్ : తన కెరీర్‌లో రోహిత్ శర్మతో అనుబంధం ప్రత్యేకమైనదని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్-18లో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌తో తనకున్న అనుబంధం గురించి కోహ్లీ వివరించాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్‌లో పంచుకుంది. ఇద్దరం ఒకేసారి కెరీర్ ప్రారంభించడం, చాలా కాలం ఆడటం ద్వారా తమ ఇద్దరి మధ్య సహజమైన బంధం ఏర్పడిందని చెప్పాడు.‘ఒకరి నుంచి ఒకరం నేర్చుకున్నాం. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలను కలిసి చర్చించుకున్నాం. జట్టుకు నాయకత్వం వహించే విషయంలో మేము చాలా దగ్గరగా పనిచేశాం. ఆలోచనలను పంచుకునేవాళ్లం. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండేది. అదే జట్టు కోసం పనిచేసేలా చేసింది. మేము చాలా కాలం పాటు కలిసి ఆడటాన్ని ఆస్వాదించాం. మేము పంచుకున్న ప్రతి క్షణం, ప్రతి జ్ఞాపకం ప్రత్యేకమైనదే.’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు నమోదు చేసింది. మరోవైపు, నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయంతో ముంబై పేలవ ప్రదర్శన చేస్తున్నది.