టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవీ విరమణ

by Anukaran |   ( Updated:2020-12-17 11:30:22.0  )
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవీ విరమణ
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రవతి, ఖాద్రి పదవీ విరమణ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో 50ఉద్యోగాల భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా సమర్థుడైన ఘంటా చక్రపాణిని కేసీఆర్ నియమించడం అభినందనీయమన్నారు. ఆరేళ్లలో 38వేల ఉద్యోగాల భర్తీని ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించడం జరిగిందన్నారు.

సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు చక్కటి ఇళ్ల నిర్మాణం కోసం తనను డిజైన్ చేయమని కోరితే.. తాను ఘంటా చక్రపాణి సాయంతో అద్భుతమైన డిజైన్‌ను రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీ విషయంలో అందరి మన్ననలు పొందిన పాలకవర్గం పదవీ విరమణ చెందడం బాధగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని విభాగాల్లో ఖాళీలను సేకరించామని, త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed