- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొన్నం అరెస్టుకు రంగం సిద్ధం
దిశ, కరీంనగర్ :
ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద జలదీక్ష చేపట్టాలని భావించిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎగువ మానేరు ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లు రాకపోవడానికి మంత్రి వైఫల్యమే కారణమంటూ పొన్నం ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జలదీక్ష కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పొన్నం అప్పర్ మానేరు ప్రాజెక్టు వద్ద దీక్ష చేయాలని నిర్ణయించారు. ఆయన మరికొద్దిసేపట్లో అప్పర్ మానేరు ప్రాజెక్టు వద్దకు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే మాజీ ఎంపీతో పాటు, ఇతర కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.