జూడాలకు మరో చాన్స్.. రేపు ఉదయం 8 గంటలకు..

by vinod kumar |
జూడాలకు మరో చాన్స్.. రేపు ఉదయం 8 గంటలకు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమ డిమాండ్లను పరిష్కరించని యెడల రేపు(గురువారం) నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించనున్నట్లు జూడాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం బుధవారం సాయంత్రం జూడాలతో చర్చలు జరిపింది. డీఎంఈ రమేష్ రెడ్డితో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను తీర్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

ఇన్సెంటివ్‌తో పాటు కొవిడ్ డెత్ జరిగితే ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని డీఎంఈ స్పష్టం చేశారు. అయితే, తమ డిమాండ్లకు రాత పూర్వక హామీ ఇస్తేనే విధుల్లో చేరతామని జూడాలు కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. చర్చలు ఫలప్రదంగా సాగకపోవడంతో రేపు ఉదయం 8 గంటల ప్రాంతంలో మరోసారి చర్చలకు రావాలని ప్రభుత్వం జూడాలకు పిలుపునిచ్చింది. అయితే, రేపు జరిగే చర్చల్లో ప్రభుత్వం మాట జూడాలు వింటారా.. జూడాల మాటను ప్రభుత్వం వింటుందా.. అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed