విరించి హాస్పిటల్‌‌‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్..

by vinod kumar |
విరించి హాస్పిటల్‌‌‌కు తెలంగాణ ప్రభుత్వం షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల విరించి హాస్పిటల్ యాజమాన్యానికి తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. కొవిడ్ మృతుడు వంశీకృష్ణ మృతదేహాన్ని అప్పగించడానికి రూ.20 లక్షలు డిమాండ్ చేసిన కేసులో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పాటు మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులు దర్యాప్తు జరిపారు. 24 గంటల వ్యవధిలో సంజాయిషీ ఇవ్వాలని డీహెచ్ పంపించిన నోటీసుల విషయంలోనూ విరించి యాజమాన్యం నుంచి స్పందన రాలేదు.

ఈ నేపథ్యంలోనే ఇకపై విరించి ఆస్పత్రిలో కొవిడ్ షేషెంట్ల అడ్మిషన్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న కొవిడ్ రోగులకు ఇబ్బంది కలుగకుండా, నేటి నుంచి కొత్త రోగులను చేర్చుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని డీహెచ్ శ్రీనివాస్ స్పష్టంచేశారు. అంతేకాకుండా ఇక మీదట ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా కొవిడ్ రోగులను ఇబ్బందులకు గురిచేస్తే లైసైన్సులు కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed