వసుదేవుడికే తప్పలేదు.. ఆఫ్ట్‌రాల్ ట్రంప్ ఎంత

by Shamantha N |   ( Updated:2021-01-30 23:01:32.0  )
వసుదేవుడికే తప్పలేదు.. ఆఫ్ట్‌రాల్ ట్రంప్ ఎంత
X

దిశ,వెబ్‌డెస్క్: బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో.! వసుదేవుడు అంతటి వాడె గాడిద కాళ్లు పట్టుకున్నారన్న సామెత ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది.అగ్రరాజ్యాన్ని అన్నీ తానై నడిపిన ట్రంప్ తరుపున లాయర్లు వాదించేందుకు మొండికేస్తున్నారు. ఫిబ్రవరి 8నుంచి ఇంపీచ్ మెంట్ కేసుపై అమెరికన్ సెనేట్ లో విచారణ జరగనుంది. అయితే విచారణలో భాగంగా ట్రంప్ తరుపు లాయర్లు… పదవి నుంచి దిగిపోయిన ప్రెసిడెంట్ను విచారించడమేంటనే యాంగిల్లో వాదిస్తే ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ‘బైడెన్ ఎన్నిక ఫ్రాడ్’ అనే యాంగిల్లోనే వాదించాలని కోరుతున్నారు. దీంతో ట్రంప్ కు లాయర్ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. చేసేది లేక తాము ఈ కేసును వాదించలేమని ఐదుగురు ట్రంప్ తరుపు లాయర్లు పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు తాను చెప్పిన అంశంపై వాదించే లాయర్ల కోసం వెతుకుతున్నారు ట్రంప్

Advertisement

Next Story

Most Viewed