- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోంట్ వర్రీ.. షర్మిలను అడ్డుకోవడానికి కవిత ఉంది..!
దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల రాష్ట్రంలో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపించదనే ధీమాలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉంది. తాజా రాజకీయ పరిణామాలపై గులాబీ అధినేత కేసీఆర్క్షేత్రస్థాయిలో ఆరా తీసినట్టు తెలిసింది. నిఘావర్గాల సమాచారంతోపాటు, సొంతంగా కూడా సర్వే చేయించుకున్నారని చెబుతున్నారు. నివేదికలను పరిశీలించిన అనంతరం షర్మిల పార్టీతో టీఆర్‌ఎస్‌కు ముప్పేమీ లేదని పార్టీ నేతలకు స్పష్టం చేశారని అంటున్నారు.
రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా షర్మిల అడుగులు వేస్తున్నారు. జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. షర్మిల సీఎం కేసీఆర్ ప్రయోగిస్తున్న బాణమని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలూ వచ్చాయి. షర్మిల పార్టీతో లాభనష్టాలు ఎవరికన్న చర్చ అన్ని పార్టీలలో జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడైతే ఎన్నికల వాతావరణం లేదు. షెడ్యూల్‌ప్రకారం జరిగితే 2023 వరకు, జమిలీ ఎన్నికలు వచ్చినా, టీఆర్ఎస్ముందస్తు అనుకున్నా 2022 చివరిలోనో ఎన్నికలు జరుగుతాయి.
ఈ రెండేళ్లలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం, బలం పుంజుకోవడం జరగాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొంత అసాధ్యమే. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలలో కులాలు, మతాలు కీలకంగా మారిపోయాయి. రెడ్లు తమకు టీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం లేదంటూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. రేవంత్‌రెడ్డి వీరికి కీలకంగా మారుతారని అనుకున్నారు. షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్న ప్రకటించిన నేపథ్యంలో రెడ్డివర్గం అటువైపు సపోర్టు చేస్తుందనీ భావించారు. దీనిపై ఎలాంటి చర్చలు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో షర్మిల రాజకీయ పార్టీ, దాని ప్రభావం మీద టీఆర్‌ఎస్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
మనోళ్లు మనకు
గతంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండే ఎస్సీ, ఎస్టీ, కొంతవరకు బీసీవర్గాలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నాయని అంచనా వేస్తున్నారు. షర్మిల పార్టీ పెడితే ఈ వర్గాల నుంచి వెళ్లేవారు తక్కువగానే ఉంటారని గుర్తించినట్లు సమాచారం. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇంకా అభిమానంతో ఉన్నా, అతి తక్కువ శాతమే షర్మిల వైపు వెళ్లే అవకాశం ఉంటుందనుకుంటున్నారు. దీనిని తేలికగా తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికలలో వైసీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశంపై లెక్కలేసుకుంటున్నారు. షర్మిల పార్టీతో ఎక్కువ నష్టం కాంగ్రెస్‌కే ఉంటుందనుకుంటున్నా, కాంగ్రెస్‌ను అధికార పార్టీ బలమైన ప్రత్యర్థిగా గుర్తించడం లేదు. యూత్ అధికార పార్టీకి కూడా మద్దతుగా ఉండటం లేదు. దీంతో బీజేపీకే నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కవితతో బ్రేక్
రాష్ట్రంలో షర్మిల పార్టీ స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు అధికార టీఆర్ఎస్… ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపుతున్నట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహిళల్లో కవితకు ఒకింత ఫాలోయింగ్ఉంది. తెలంగాణ బతుకమ్మగా పేరు తెచ్చుకున్నారు. కొంతమేరకు యూత్ లీడర్‌గా కూడా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. మొన్నటి వరకు సోషల్ మీడియా అంటే తిట్టిపోసే సీఎం కేసీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉండాలంటూ సూచించిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ఎన్నికల తర్వాత కొంత స్తబ్ధుగా ఉన్న కవిత ఎమ్మెల్సీ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శలున్న బీజేపీకి బ్రేక్వేసేందుకు హిందువాదం, యూత్‌పై ఆశలు పెట్టుకున్న షర్మిలకు అడ్డుకట్ట వేసేందుకు యూత్ఐకాన్గా టీఆర్ఎస్ వైపు ఆకర్షించేదుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులపై దృష్ఠి పెట్టిన గులాబీ బాస్.. షర్మిల పార్టీతో ఇబ్బందులేమీ లేదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నేతలకు కూడా ధీమా చెప్పుతున్నారు. షర్మిల పార్టీని లైట్‌గా తీసుకోవాలని సూచించినట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.