తాలిబన్లకు టీఆర్ఎస్ మద్దతు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-08-20 03:44:10.0  )
తాలిబన్లకు టీఆర్ఎస్ మద్దతు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తాలిబన్ మద్దతు దారులు రాష్ట్రంలో ఉన్నారని అధికారంలో ఉన్న పార్టీ తాలిబన్ మద్దతు దారులతో అనుకూలంగా ఉందని బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రోమోను, లోగోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రిలీజ్ చేశారు. వీటితో పాటు ప్రజల అభిప్రాయాలు, రిజిస్ట్రేషన్ కోసం మిస్డ్ కాల్ నెంబర్ 6359119119, వెబ్సైట్‌ను ఆవిష్కరించారు.

ఈ నెల 24 నుంచి నెంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ ఎంఐఎం నాయకులు తాలిబన్‌లకు సపోర్ట్ చేసేలా ప్రసంగాలు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ విస్తృత స్థాయిలో పాదయాత్ర ఏర్పాట్లు చేపట్టిందని చెప్పారు. కార్యకర్తలను వివిధ స్థాయిలో సమాయత్తం చేస్తున్నామని తెలిపారు. 2014 తరువాత రాష్ట్రంలో‌ నూతన ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గత 7 ఏళ్ళు‌గా సరైన దిశలో రాష్ట్రం వెళ్లడం లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. అసెంబ్లీ నడిచే విధానం, కేటాయించే సమయాలు తగ్గిపోతున్నాయని దీని వలన సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రాజకీయ అవకాశాలు తగ్గి కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నా కాని భర్తీ చేయడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని దుస్థితికి రాష్ట్రం దిగజారిందని చెప్పారు.

ఆగస్ట్ 10 వరకు ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని తెలిపారు. 2019 వరకు 2లక్షల ఇండ్లు నిర్మాణం కావలసి ఉండగా ఇప్పటి వరకు 30 వేల ఇండ్లు మాత్రమే నిర్మించారని చెప్పారు. పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్నగర్, నల్గొండ లో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అవినీతి అంటే కేసీఆర్ ఫ్యామిలీ అని ఆరోపించారు. మూసినది లో ఉన్న కాలుష్యం లా టీఆరెస్ లో అవినీతి పేరుకుపోయిందని చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ ను గద్దె దించాలని చెప్పారు. కేవలం బీజేపీ మాత్రమే టీఆర్ఎస్ ను ఓడించగలదన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని చెప్పారు. బీజేపీ బలోపేతమై తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed