ఆ గ్రామాల్లో ఓట్లు అడగబోము.. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం

by Sridhar Babu |
MLC Jeevan Reddy
X

దిశ, జగిత్యాల: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం, అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా అగ్రస్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని అన్నారు. దేశభక్తి, మతసామరస్యం, హిందూత్వం కాంగ్రెస్ పార్టీ గుండెల్లో ఉందని వెల్లడించారు. దేశ ప్రజలపై మతాలను రుద్ది, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ బీజేపీ యువతను తప్పుతోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం చూపిస్తే, ఆ గ్రామంలో ఓట్లు అడగబోనని, టీఆర్ఎస్ పార్టీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వని గ్రామాల్లో ఓట్లు అడగబోము అని చెప్పాలని సవాల్ విసిరారు. తన 40 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చూడలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, కౌన్సిలర్ జీవన్, అల్లాల సరిత, రమేష్ రావు, రఘువీర్ గౌడ్, మన్సూర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed