- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దేశం గర్వించదగ్గ నేత కేటీఆర్

దిశ, న్యూస్‌బ్యూరో: దేశం గర్వించదగ్గ నేత కేటీఆర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కొనియాడారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా సమయంలో పేద ప్రజలకు సేవలందించి గిప్ట్ ఏ స్మైల్ ఉద్యేశ్యాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్‌లో ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేత సామ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరం, కేసీఆర్ సేవాదల్.. కేటీఆర్‌పై రూపొందించిన ఆడియో సీడీ అవిష్కరణ, ప్రమాదాల్లో మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా పంపిణీలో కర్నె ప్రభాకర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కేటీఆర్ అతి సాధారణంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికే ప్రాధాన్యత నిచ్చారన్నారు. పార్టీ శ్రేణులు ఆడంబరాలజోలికి పోకుండా సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేయాలన్నారు. అవసరమైన వారికి ఈ కరోనా కాలంలో సేవలందించి ‘గిఫ్ట్ ఏ స్మైల్ ‘ఉద్దేశ్యాన్ని విజయవంతం చేయాలని కోరారు.