- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మధ్యవర్తులను నమ్మకండి.. రైతులను కోరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
by Aamani |

X
దిశ, కామారెడ్డి: భూములు కోల్పోతున్న రైతులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం భూములు కోల్పోతున్న రైతులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో భూములు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. రైతులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తపరిచారు. అసైన్డ్ భూములు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, లింగంపల్లి, జనగాం, కరడ్ పల్లి గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story