New MLCs Swearing : రేపు నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

by M.Rajitha |   ( Updated:2025-04-06 15:55:17.0  )
New MLCs Swearing : రేపు నూతన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం(New MLC Swearing) రేపు జరగనుంది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Guttha Sukhendar Reddy) రేపు మండలిలో వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి(Vijayashanthi), అద్దంకి దయాకర్(Addanki Dayakar), శంకర్‌ నాయక్(Shankar Naik), సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం(Nellikanti Satyam), బీజేపీ నుంచి కొమురయ్య(Komuraiah), అంజిరెడ్డి(Anjireddy) , స్వతంత్ర అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి(Sripal Reddy)ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరు కానున్నారు.



Next Story

Most Viewed