వ్యక్తి దారుణ హత్య.. నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు

by Kalyani |
వ్యక్తి దారుణ హత్య.. నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు
X

దిశ, పరిగి: వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేశారు. దోమ మండలం మైలారం గేట్ సమీపంలో ఖమ్మం నాచారం కు చెందిన బోయిని మొగులయ్య (60) అనే వ్యక్తి కొంతకాలం పాటు పొలం వద్ద జీవిస్తున్నాడు. పక్క పొలం వారు ఆదివారం ఉదయం వెళ్లి చూసేసరికి మొగులయ్య హత్యకు గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానికులకు, కుటుంబీకులకు గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా నరికి చంపారు..మెడపై ,తలపై బలంగా నరికి నట్టు నాలుగు తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి పడుకున్న చోటే హత్య చేసినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలికి 50 మీటర్ల దూరంలో ఉన్న నీటిగుంతలో ఓ గొడ్డలిని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం జాగిలాలతో ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి ఎవరితో గొడవలు లేవని, ఎప్పుడూ పొలం వద్దే ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనుమానితులుగా ఉన్న కుటుంబీకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed