- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే కిశోరన్నా.. ఇదేందన్నా..?
దిశ, నకిరేకల్ : నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు జోరుగా తరలివస్తున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక తరహాలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నకిరేకల్ పట్టణంలోని ప్రతివార్డులోనూ ప్రచారం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో ఒకరికి సోకిన కరోనా మరొకరి ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు. అయితే కొంతమంది పట్టణవాసులు ఇంట్లోకి రాకుండా బయట నుంచి బయటకు పంపుతున్నా.. మరికొంతమంది ప్రజాప్రతినిధులను మొహామాటంతో బయటకు పంపలేకపోతున్నారు.
ఇదిలా వుంటే.. అధికార టీఆర్ఎస్‌కు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కరోనా నిబంధనలను పక్కకు నెట్టి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా సంచరిస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలే నకిరేకల్ పట్టణంలో రోజురోజూకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ ప్రజాప్రతినిధులే ఇలా మాస్కులు పెట్టుకోకుండా ప్రచారం చేయడం విమర్శలకు తావిస్తోంది. మాస్కు లేకుండా బయటకు వచ్చిన సామాన్యులకు స్పాట్‌లోనే ఫైన్ వేస్తోన్న పోలీసులు.. మరీ ఎమ్మెల్యే కిశోరన్న వ్యవహారాన్ని ఏలా తీసుకుంటారో వేచిచూడాలి.