- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దుబ్బాక టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ..!
దిశ, దుబ్బాక : దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం తర్వాత ఆ కుటుంబంపై సానుభూతి చూపాల్సిన టీఆర్ఎస్ నేతలు అసమ్మతి సెగ లేపుతున్నారు. ఆయా మండలాల్లో నాయకులు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేసి వారి బాధలను వెల్లగక్కుతున్నారు. చేగుంటకు చెందిన ఓ నాయకుడు, రాయపోల్ చెందిన మరో నాయకుడు రామలింగారెడ్డి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వద్దని, వారి కుటుంబంపై అసంతృప్తి ఉందని వేర్వేరుగా అసమ్మతి సమావేశాలు ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, కార్యకర్తలు అసమ్మతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసినా న్యాయం జరగలేదని ఎవరికి వారు ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి వెంట నలుగురు వ్యక్తులు ఉండి దుబ్బాక రాజకీయానికి, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చారని ఆరోపించారు. ఇప్పుడు రాబోయే ఉపఎన్నికల్లో ఆ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే మళ్లీ తమను అణగతొక్కుతారని ఆవేదన వ్యక్తం చేశారు.