ఆడుకుంటున్న చిన్నారిపై టీఆర్ఎస్ లీడర్ అఘాయిత్యం.. అరెస్టు!

by Sumithra |
ఆడుకుంటున్న చిన్నారిపై టీఆర్ఎస్ లీడర్ అఘాయిత్యం.. అరెస్టు!
X

దిశ, ములకలపల్లి : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై తెరాస నాయకుడు ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని తన ఇంట్లోకి తీసుకువెళ్లి పసిపాపపై లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలి తల్లి పాపకు స్నానం చేయించే క్రమంలో నొప్పిగా ఉందని స్నానానికి సహకరించకపోవడంతో అసలు ఏం జరిగిందో తల్లిదండ్రులు ఆరా తీశారు.

తన కూతురితో పాటు రోజు ఆటలు ఆడుకునే పిల్లల ద్వారా ఏం జరిగిందో అని తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఇలాంటి విషయం బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని భావించారు. కానీ, ఈ దారుణాన్ని ఇలాగే ఉంచితే ఆ దుర్మార్గుడు ఇంకెంత మంది బాలికలను తన వికృత చేష్టలకు బలిచేస్తాడో అని ధైర్యం తెచ్చుకుని బుధవారం స్థానిక పోలీసు‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు..

నర్సాపురంనకు చెందిన మాదిబోయిన సత్యనారాయణ ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై బి.సురేష్ తెలిపారు. ఈ మేరకు బాధితురాలిని పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితుడిని చట్టప్రకారం శిక్షిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story