- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈటలకు అమిత్ షా ఫోన్‌పై ఇరు వర్గాల క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ అధినేత ఆగ్రహానికి గురై షామీర్‌పేట్‌లోని ఫాం హౌజ్‌కు మాత్రమే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ అభిమానులతో అక్కడ సందడి వాతావరణం నెలకొనింది. కానీ రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ సీనియర్ నేత అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇటు ఈటల వర్గీయులు, అటు బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా శనివారం షామీర్‌పేట్ వెళ్ళాలనుకున్నప్పటికీ రద్దీ దృష్ట్యా వెళ్ళకుండా టెలిఫోన్‌లోనే ఈటలకు సానుభూతి తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బండి సంజయ్ ధృవీకరించలేదు. ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని మీడియా ద్వారా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ షామీర్‌పేట్‌కు వెళ్ళి ఈటలను కలిసే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులే సూచనప్రాయంగా తెలిపాయి. కానీ చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలిసింది.