సమయం తక్కువైంది.. ప్రచారం భారమైంది..!

by Anukaran |   ( Updated:2020-11-27 20:52:36.0  )
సమయం తక్కువైంది.. ప్రచారం భారమైంది..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేక పోతున్నారు. ఈ సారి ఎన్నికల కమిషన్​ ప్రచారానికి పెద్దగా సమయం ఇవ్వకపోవడంతో ఓటర్లను కలువలేకపోతున్నారు. అయితే సమయానికి అనుగుణంగా కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. అన్ని పార్టీలకు అంతే సమయం ఉన్నప్పటికీ అధికార పార్టీ అభ్యర్థులకు టీఆర్ఎస్ యాత్ర అదనపు భారంగా మారింది. పదకొండు రోజుల సమయంలోనే క్యాడర్‌ను రూపొందించుకోవడం, క్యాంపెయిన్ వ్యూహాలను రచించడం, పకడ్బందీగా ఓటు బ్యాంకుపై అం చనాకు వచ్చి పనిచేయడం వంటివి సాధ్యంకాలేదని అభ్యర్థులు చెబుతున్నారు.

గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న ఒక్కో డివిజన్ పరిధిలో 30 వేల మందికి తగ్గకుండా ఓటర్లు ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో వారందరినీ కలవడం, సాధారణ పద్ధతిలో ఎలక్షన్ ప్రచారం సాధ్యపడటం లే దు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కనీసం 20 రోజుల సమయం ఉం డడంతో ఎక్కువ మంది వరకూ అభ్యర్థులు వెళ్లగలిగారు. ప్రస్తుత సమయంలో ఇతర పార్టీల ప్రచా రాన్ని గమనించడమేమో గానీ, సొంత ప్రచారం మీద దృష్టి సారిచేందుకు కూడా సమయం సరిపోవడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు.

ప్రచారానికి ఉదయాన్నే…

ఉదయం 6:30 గంటల మధ్యనే గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం డివిజన్లలో అభ్యర్థులు బయలు దేరుతున్నారు. జిల్లాల నుంచి పార్టీ ప్రచారానికి వచ్చిన అభ్యర్థులు వారి షెడ్యూల్ ప్రకారం డివిజన్లకు ముందు రోజు రాత్రే చేరుకుంటారు. స్థానికంగా ఉన్న అనుచరులు సైతం అభ్యర్థి ఇంటి వద్దకు చేరుకుంటారు. సమయం, ప్రచార అవసరాన్ని బట్టి ఇంటివద్ద లేదా ఏదైనా టిఫిన్ సెంటర్ వద్ద అల్పాహారం తినేందుకు షెడ్యూల్ రూ పొందించుకుంటారు. ఆ ప్రకారమే ముందుకు వెళ్తారు. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండడంతో స్థానికంగా ప్రజలు గుర్తించేవారు ఉండేలా కాలనీ, బస్తీ కమిటీలను వేసుకున్నారు.

ఒక్కో డివిజన్‌లో 10-15 బస్తీ కమిటీలు ఉన్నాయి. నిర్దేశిత ఏరియాలో మైక్‌లు, ఆటో రిక్షాల ప్రచారంతో పాటు కరపత్రా లు, ఇంటింటి ప్రచారాన్నే వారే నిర్వహిస్తున్నారు. పార్టీలో చేరికలు, తమతో కలిసేందుకు కొత్తగా వచ్చేవారి ఇండ్లకు నేరుగా వెళ్లేం దుకు ముందుగా సమయాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. స్థానికంగా రాజకీయంగా, ఆర్థిక, సామాజిక వర్గాల్లో పేరున్నవారిపై అభ్యర్థులు దృష్టి పెడుతున్నారు. వారితో సంబంధమున్న ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు వ్యూహాలను అనుసరిస్తున్నారు. అభ్య ర్థులు కూడా ఇంటింటికి వెళ్లడం సాధ్యకానప్పుడు.. తమ అనుచరుల ద్వారా ఆ ప్రచారాన్ని జరిగేలా చూసుకుంటున్నారు.

మద్యం, డ బ్బులు ఇతరత్రా కార్యక్రమాలకు, తటస్థ ఓటర్లను గమనించి క్యాంపెయిన్ అనంతరం కలుసుకునేలా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 10 గంటల వరకు అభ్యర్థి వీధుల్లో, కాలనీల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటూ, మరోవైపు ఏర్పాటు చేసిన కమిటీలను సమన్వయం చేసుకుంటున్నా రు. ఇక ప్రచారానికి చివరి రెండు రోజులు మాత్రమే ఉండటంతో తమ డివిజన్‌లో మెజారిటీ ఓట్లను రాబట్టే రూట్లలో పూర్తిగా పాదయాత్రలు ని ర్వహించేందుకు ప్రధాన పార్టీల అ భ్యర్థులు సిద్ధమయ్యారు. కొన్ని ఏరియాల్లో శుక్రవారమే ఈ తరహా కార్యక్రమానికి అభ్యర్థులు శ్రీకారం చుట్టగా, ఈ రెండు రోజులు ప్రధాన కాలనీల్లో, మేజర్ ఓటు బ్యాంకు ఉన్న వ్యక్తులను నేరుగా కలుసుకునేందుకు అభ్యర్థులు ప్లానింగ్ చేసుకున్నారు.

మిగిలిన రాజకీయ పార్టీల అభ్యర్థులు వారి పరిస్థితులకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటుండగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు కేటీఆర్ యాత్ర అదనపు టాస్క్‌గా మారిపోయింది. ముందుగానే విడుదల చేసిన రూట్ మ్యాప్ ప్రకారం కేటీఆర్ యాత్ర సాగుతుండగా, పక్కనున్న నాలుగైదు డివిజన్ల నుంచి జనాలను తరలించడం కూడా ఆయా కార్పొరేటర్ అభ్యర్థుల బాధ్యత. జనాలను తరలించేందుకు వాహనాలు, భోజ నం, ఇతర ఖర్చులన్నీ అభ్యర్థులే భరించాలి.

తమ డివిజన్ నుంచి తక్కువ జనం వెళ్తే తనకు తగిన గుర్తింపు లభించదేమోననే ఆందోళనలో సైతం అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఒక వైపు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తూనే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను మెప్పించాలి. ఇందుకోసం తమ ముఖ్య నాయకులను, అనుచరులను పంపిస్తే.. ప్రచారం చేసుకునేందుకు మేనేజ్‌మెంట్, మ్యాన్ పవర్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇంత తక్కువ సమయంలో ఎలాగైనా కార్పొరేటర్ సీటు దక్కించుకోవాలని వెళ్తుంటే.. కేటీఆర్ యాత్రతో అదనంగా మరో పని భారం పడినట్టు టీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు.

Advertisement

Next Story