‘వెయ్యి కప్పలు అరిచినట్లు ఉంది’.. స్టార్ హీరో పాటపై ట్రోల్స్

by Shyam |   ( Updated:2023-12-14 14:36:50.0  )
‘వెయ్యి కప్పలు అరిచినట్లు ఉంది’.. స్టార్ హీరో పాటపై ట్రోల్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్.. యాక్టర్, డైరెక్టర్‌గానే గాక సింగర్, రైటర్‌గానూ నిరూపించుకున్నాడు. అయితే, తన సింగింగ్ టాలెంట్‌పై ప్రేక్షకుల్లో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ క్రమంలో అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘పించ్’టాక్ షో లేటెస్ట్ ఎపిసోడ్‌కు హాజరైన ఫర్హాన్.. తన సింగింగ్‌పై నెటిజన్ల కామెంట్స్, డాన్-3 మూవీ కోసం రిక్వెస్ట్స్, సోషల్ మీడియాలో ట్రోల్స్‌తో పాటు సలీం-జావేద్ విడిపోవడం వెనకున్న మిస్టరీ గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంగా ఫర్హాన్ సింగింగ్‌పై నెటిజన్ల నెగెటివ్ కామెంట్లను అర్బాజ్ ఖాన్ చదివి వినిపించగా.. తన గాత్రం ‘వెయ్యి కప్పలు అరిచినట్లు ఉంది’ అనే కామెంట్‌పై నవ్వుతూ స్పందించాడు. ఇది సోషల్ సర్వీస్‌లో భాగమేనన్న అక్తర్.. అందరూ నా పాటలు వింటూ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అయితే ‘రాక్ ఆన్’, అమితాబ్ బచ్చన్‌ ‘ఆత్రంగి యారీ’తో పాటు ‘జిందగీ నా మిలేగీ దొబారా’ పాటల్ని ఆడియన్స్ ఆస్వాదించారని వెల్లడించాడు. ‘నాది ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ సింగర్ వాయిస్ కాదని అర్థం చేసుకోండి. ప్లే బ్యాక్ సింగింగ్‌కు నిర్దిష్టమైన క్వాలిటీ ఉంటుంది. నా స్కిల్స్, గాత్రం ఆ స్థాయిలో లేవు. కాబట్టి నేను ఇతరుల కోసం పాడను. నా వరకైతే పాడటాన్ని ఆస్వాదిస్తున్నా.. దాని గురించి నేను క్షమాపణ చెప్పను’అని వివరణ ఇచ్చాడు.

Advertisement

Next Story