‘త్రిభంగ‌’లో క్లాసికల్ డ్యాన్సర్‌గా కాజోల్

by Anukaran |   ( Updated:2021-01-01 07:44:00.0  )
‘త్రిభంగ‌’లో క్లాసికల్ డ్యాన్సర్‌గా కాజోల్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కాజోల్ ‘త్రిభంగ’ టీజర్ రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌గా వస్తున్న సిరీస్‌తోనే కాజోల్ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతుండగా.. మిథిలా పల్కర్, తన్వీ అజ్మి ప్రధానపాత్రల్లో కనిపించనున్నారు. టీజర్‌లో మూడు జనరేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ముగ్గురి జర్నీని హైలెట్ చేయగా.. కాజోల్ క్లాసికల్ డ్యాన్సర్‌ లుక్‌లో కనిపించి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.

ప్రేమ అనేది ఎప్పటికీ అన్‌కండిషనల్‌గా ఉంటుందా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సిరీస్‌కు యాక్టర్ రేణుక సుహానే దర్శకత్వం వహించారు. కాజోల్, తన్వి, మిథిల.. తాను ఊహించిన దానికంటే ఎక్కువగా పాత్రలకు న్యాయం చేశారని, ఆ క్యారెక్టర్స్‌లో జీవించేందుకు వందశాతం ప్రయత్ని్ంచారని కొనియాడారు. ఈ ముగ్గురినీ ‘త్రిభంగ’ సిరీస్‌‌కు ఆత్మగా అభివర్ణించారు. కాగా ఈ సిరీస్ జనవరి 15న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

Advertisement

Next Story