- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కొవిడ్ బాధిత కుటుంబాలకు గిరిజన మహిళ సాయం
దిశ, ఫీచర్స్ : గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ లెక్కలు పరిశీలిస్తే.. ఏ ఫ్యామిలోనైనా ఒక్కరికి లేదా ఇద్దరికి కరోనా వైరస్ సోకిన సందర్భాలుంటే, వారిని ఐసోలేట్ చేసి ఫుడ్ తదితర అవసరాల పట్ల ఫ్యామిలీ మెంబర్సే కేర్ తీసుకునేవారు. కానీ సెకండ్ వేవ్‌లో పరిస్థితి తారుమారైంది. ఉధృతంగా వ్యాపిస్తున్న వైరస్.. ఫ్యామిలీలో ఒక్కరికి వచ్చిందంటే మిగతా సభ్యులందరికీ సోకుతోంది. ఈ క్రమంలో బాధితులు ఆహారం, మందులు ఇతరత్రా అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాంచీకి చెందిన కొందరు మహిళలు కొవిడ్ బాధిత కుటుంబాలకు ఉచితంగా మీల్స్ అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో కేఫ్ నడుపుతున్న నిషా భగత్ అనే గిరిజన మహిళ.. కొవిడ్-19 బారినపడ్డ కుటుంబాలు ఆహారం కోసం పడుతున్న అవస్థలు చూసి తన వ్యాపారాన్ని సేవాకేంద్రంగా మార్చేసింది. దాదాపు 45 మంది కరోనా బాధితులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ను ఉచితంగా అందజేస్తోంది. అయితే తను ఈ సర్వీస్‌ను ఎంచుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఒకరోజు రాత్రి స్థానిక మహిళ.. నిషాకు ఫోన్ చేసి ప్లేట్ ‘కిచిడీ’ హోమ్ డెలివరీ కావాలని అడగడంతో పాటు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధపడటం తనను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే కిచిడీ వంటి మామూలు ఫుడ్‌ను ఎవరూ కూడా ఫోన్‌లో ఆర్డర్ చేయరని గుర్తుచేసుకుంది. ఈ క్రమంలో సదరు మహిళ.. తన ఫ్యామిలీలో అందరం వైరస్ బారినపడ్డామని, వంటచేసే స్థితిలో లేమని వారి పరిస్థితిని చెప్పుకుంది. కాగా ఈ సంఘటనే.. అటువంటి ఫ్యామిలీలకు ఫ్రీగా ఫుడ్ సప్లయ్ చేయాలనే ఆలోచనను తనలో కలిగించిందని నిషా వివరించింది.
ఈ క్రమంలో కొవిడ్ పేషెంట్ల కోసం ఉచిత భోజన సదుపాయం గురించి సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేయడంతో బాధితుల నుంచి నిషాకు కాల్స్ రావడం మొదలయ్యాయి. కాగా, నిషా ఈ సేవలు కొనసాగించేందుకు వీలుగా చంద్రశేఖర్, వినిత సాహులు తనకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ మేరకు ఉదయం 5 గంటలకే పని ప్రారంభించి బ్రేక్ ఫాస్ట్‌లో బాయిల్డ్ ఎగ్‌తో పాటు ‘పోహా, ఇడ్లీ, ఉప్మా.. లంచ్‌లో అన్నం, రోటీ, వెజిటేబుల్ కర్రీస్, సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక డిన్నర్‌లో ఒక వెజిటేబుల్ కర్రీతో పాటు చపాతీని హోమ్ డెలివరీ చేస్తున్నట్టు నిషా వెల్లడించింది. ఈ క్రమంలో నిషా తన సేవా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు చాలా మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేస్తుండటం విశేషం.
‘ప్రజలకు సేవచేస్తూ వారి ఆశీర్వాదం పొందడం నా అదృష్టం. ఇది నాకు ఆత్మ సంతృప్తితో పాటు పనిని కొనసాగించేందుకు కావలసిన అంతర్గత బలాన్ని అందిస్తుంది’ అని నిషా చెప్పుకొచ్చింది.