- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: ఏంటీ.. హాలీమ్ తయారీకి ఇంతమంది ఇంతలా కష్టపడుతారా?

దిశ, వెబ్ డెస్క్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ (Ramjan) మాసం ప్రారంభమైంది. ఇక రంజాన్ అంటే ముందుగా గుర్తొచ్చేంది హాలీం (Haleem). కేవలం ముస్లింలే కాదు.. హలీంను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో (Hyderabad) ఈ రంజాన్ మాసంలో ఏ సందులో చూసిన హలీమ్ వాసనలే ఘుమఘుమలాడుతాయి. ఇంతలా ప్రజాదరణ పొందిన ఈ హలీం తయారీ వెనుక ఉన్న కష్టం మాత్రం చాలా మందికి తెలియదు. హలీం తయారు చేయాడానికి ఏకంగా 10 గంటలకు పైనే సమయం పడుతుందట. తాజాగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా (Viral video) మారింది.
హలీం.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరుతుంది. కానీ, హలీం తయారవ్వాలంటే ఎంతో కష్టపడాలి. రాత్రి 12 గంటలకు లేచి మటన్‌ను మంచిగా కడిగి పెద్ద మట్టి బట్టీలో పాత్రలు పెట్టి అందులో పచ్చి మిర్చి, మటన్ వేసి పెద్ద గరిటేతో కలుపుతూ ఉడికించాలి. తర్వాత బాదం, పిస్తా, జీడిపప్పు ఇలా మరో నాలుగు రకాలు పప్పు దినుసులు మొత్తం మిక్సీ వేసి అందులో వేస్తారు. వట్టివేరు, నాలుగైదు రకాల వనమూలికలు, గులాబీ రెక్కలు వేస్తారు. అంతా రెడీ అయిన తర్వాత మటన్ లేయర్ లేయర్‌గా వచ్చేవరకు ఎంతో కష్టంగా రెండు, మూడు గంటల పాటు కర్రతో కొడతారు. ఇలా కొట్టిన తర్వాత రెండు గంటలు మగ్గిస్తే.. అందరూ ఎంతో ఇష్టంగా తినే టేస్టీ హలీం సిద్ధమవ్వటం వీడియోలో చూడొచ్చు. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హాలీమ్ తయారీకి ఇంతలా కష్టపడుతారా? గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఇరాన్, పాకిస్తాన్, టర్కీ వంటి దేశాల్లో డిమాండ్ ఉన్న ఈ హలీం.. హైదరాబాద్‌కు నిజాం పరిపాలన కాలంలో ప్రవేశించింది. నిజామీ ఆస్థానంలో ఉన్నతాధికారి అయిన సుల్తాన్ సైఫ్ నవాజ్ జంగ్.. హైదరాబాద్‌లో హలీమ్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారని చరిత్రకారులు చెబుతారు. మొదట చార్మినార్‌కు సమీపంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో సైనికులకు ఫిల్లింగ్ డిష్‌గా దీన్ని ఉపయోగించేవారు. ఆ తర్వాత కాలక్రమంలో ఇది రంజాన్ వంటకంగా ప్రజాదరణ పొందింది.