Lavanya Tripathi : గ్లామర్ డోస్ పెంచేసిన మెగా కోడలు.. స్కిన్ కలర్ డ్రెస్‌లో స్కిన్ షో

by sudharani |
Lavanya Tripathi : గ్లామర్ డోస్ పెంచేసిన మెగా కోడలు.. స్కిన్ కలర్ డ్రెస్‌లో స్కిన్ షో
X

దిశ, సినిమా: సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)కి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌(Varun Tej)ను ప్రేమ వివాహం చేసుకుంది. తర్వాత కొన్నాళ్లు మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ జంట విదేశాల చుట్టూ విహార యాత్ర చేశారు. తర్వాత.. ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. ఈ క్రమంలోనే మ్యారేజ్ తర్వాత లావణ్య ‘మిస్ పర్‌ఫెక్ట్’ (Miss Perfect) అనే వెబ్ సిరీస్‌లో నటించింది.

ఈ వెబ్ సిరీస్ ఊహించినంత ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ‘సతీ లీలావతి’ (Sati Leelavati) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన లావణ్య గ్లామర్ షోతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు స్కిన్ కలర్ డ్రెస్ (Skin color dress) ధరించి స్కిన్ షో చేస్తూ.. క్యూట్ ఫొటోలు షేర్ చేసింది. ప్రజెంట్ ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘సూపర్.. వేరీ క్యూట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed