- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Saptagiri: నవ్వులు పూయిస్తున్న ‘పెళ్లికాని ప్రసాద్’ ట్రైలర్..

దిశ, సినిమా: ప్రముఖ హాస్యనటుడు సప్తగిరి (Saptagiri) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెళ్లి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad). కె.వై. బాబు, భాను ప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి గోపిడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రియాంక శర్మ (Priyanka Sharma) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)కు చెందిన ఎస్.వి.సి సంస్థ విడుదల చేయబోతుంది.
ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్(Promotions)లో జోరు పెంచిన చిత్ర బృందం ‘పెళ్లి కాని ప్రసాద్’కు సంబంధించిన ట్రైలర్(Trailer)ను రిలీజ్ చేశారు. ట్రైలర్ స్టార్టింగ్‌లో సప్తగిరి వాళ్ల నాన్నతో.. 34, 36 అంటూ పెరుగుతున్న తన ఏజ్ గురించి చెప్తూ పెళ్లి చేయమని వేడుకుంటాడు. వాళ్ల నాన్న.. నీకు ఏజ్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా పెరుగుతోంది దాని చూపించి ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తున్నా అని చెబుతాడు. ఇక సప్తగిరి ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఎక్స్‌పైయిరీ డేట్ కూడా దగ్గర పడుతోంది నాన్న అంటూ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఫైనల్‌గా ‘పెళ్లి కాని ప్రసాద్’ ట్రైలర్ సోషల్ మీడియాలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.