- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parle-G Biscuits Omelet : పార్లే-జీ బిస్కెట్లతో ఆమ్లెట్.. మీరూ టెస్ట్ చూడాలనుకుంటున్నారా..? (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : యూట్యూబ్ వచ్చాక ప్రతి ఒక్కరూ తన టాలెంట్‌ను పరీక్షించుకుంటున్నారు. తమకు ఏ రంగంలో నైపుణ్యం ఉందో దానిని ప్రదర్శిస్తూ వీడియోలను షేర్ చేసుకుంటున్నారు. గృహిణీలు సైతం వంటలు, చేతి అల్లికలు, గార్డెనింగ్ తదితర వీడియోలతో యూట్యూబ్‌లో అలరిస్తున్నారు. ముఖ్యంగా వంటల వీడియోలకు కొదవలేకుండా పోయింది. తమకు ఏ చిన్న రెసిపీ (Recipe) వచ్చినా యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పార్లేజీ బిస్కెట్ల (Parle-G Biscuits)తో చేసిన ఆమ్లెట్ వీడియో (Omelet video) సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
వీడియోలో ఉన్న దాని ప్రకారం.. ఓ వ్యక్తి ఆమ్లెట్‌ను తయారు చేయడానికి సిద్ధం అయ్యాడు. ముందుగా ఉల్లిపాయను సన్నగా తురిమి పెట్టుకున్నాడు. సన్నగా తరిగిని పచ్చిమిర్చి, మసాల దినుసులు రెడీ చేసుకుని రెండు గుడ్లను ఓ గిన్నెలో పగలగొట్టాడు. వాటన్నీటిని ఓ బౌల్‌లో బాగా కలిపి.. ఆ తర్వాత బాణలిలో వెన్న వేడిచేసి దానిలో గుడ్డు మిశ్రమాన్ని పోశాడు. ఆ మిశ్రమంపై Parle-G బిస్కెట్స్‌ను రౌండ్‌గా పేర్చాడు. చివరగా తురిమిని చీజ్ వేసి ఆమ్లెట్ రెసిపీని తయారు చేశాడు. అయితే ఈ పార్లే-జీ బిస్కెట్ల ఆమ్లెట్‌ను తిన్న కస్టమర్ భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత వరస్ట్ ఫుడ్ ఎక్కడా తినలేదని.. ఇలాంటి వాంతింగ్ తెచ్చే రెసిపీలు తయారు చేయవద్దని.. పార్లే-జీ బిస్కెట్ల పరువు తీశారని రకరకాలుగా స్పందిస్తున్నారు.