Viral video: నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు.. ఎలాగో తెలుసా?

by D.Reddy |
Viral video: నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు.. ఎలాగో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) యుగం నడుస్తోంది. అందుకే నెట్టింట ఎలాగైనా ఫేమస్ అవ్వాలని చాలా మంది వింత వింత, ఫన్నీ, ప్రాంక్, ఛాలెజింగ్.. ఇలా రకరకాల వీడియోలను తీసి షేర్ చేస్తుంటారు. ఇక తాజాగా ఓ యూట్యూబర్ చేసిన ఓ ఛాలెజింగ్ వీడియో ఏకంగా అతడికి వరల్డ్ రికార్డును (World record) తెచ్చిపెట్టింది. ఇంతకీ అతనేం చేశాడంటే?

ప్రముఖ యూట్యూబర్ నార్మే (YouTuber Norme) తాజాగా ప్రపంచ రికార్డును సాధించాడు. అది కూడా నిలబడి.. నిలబడితే వరల్డ్ రికార్డు రావటమేంటి అనుకుంటున్నారా? అతడు నిలుచున్నది సాధారణంగా కాదు, ఏకంగా 38 గంటల పాటు కదలకుండా నిలబడ్డాడు. స్థానిక ప్రజలు, అతడి ఫాలోవర్స్ వచ్చి కావాలని డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులను పిలిపించినప్పటికీ.. ఇంచంతా కూడా డిస్టర్బ్ కాలేదు. తన చుట్టూ ఏం జరుగుతున్న పట్టించుకోకుండా బొమ్మలా నిలబడ్డాడు. విజయవంతంగా 38 గంటల పాటు నిలబడి ప్రపంచ రికార్డు సాధించిన అతడి టాలెంట్‌ను జనాలు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది.

ఇక వీడియో చూసిన నెటిజన్లు.. సూపర్, గ్రేట్, 'అంతసేపు కదలకుండా ఉండటానికి బాడీని, మైండ్‌ని ట్రైన్ చేయాలి', 'డిస్ట్రాక్షన్స్‌ని, ఇబ్బందుల్ని పట్టించుకోకుండా ఉండాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి', 'ఇది పిచ్చెక్కిపోయే సెల్ఫ్ కంట్రోల్' అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement
Next Story

Most Viewed