viral video: భూమి తిరగడాన్ని చూశారా? చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

by D.Reddy |
viral video: భూమి తిరగడాన్ని చూశారా? చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: భూమి (Earth) తన చుట్టూ తాను తిరుగుతూ స్యూరుడి (Sun) చుట్టూ తిరుగుతుందని అందరికి తెలిసిందే. దీనినే భూభ్రమణం (Earth Rotation), భూపరిభ్రమణం అంటారని చిన్నప్పుడు చదువుకున్నాం. అయితే, ఇదంతా ఖగోళంలో జరుగుతుంది. మనకు కనిపించదు. అలాగే, భూమి భ్రమిస్తున్నట్లు మనకు అనిపించదు. ఇక తాజాగా సోషల్ మీడియాలో భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన ఓ వీడియో వైరల్‌గా మారింది.

భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్ (Dorje Angchuk) లద్దాఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్.. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను ఉపయోగించి వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో భూమి ఎలా భ్రమిస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని.. ఈ వీడియో తీసేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు అంగ్‌చుక్ పేర్కొన్నారు. ఒకనొక దశలో విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

విద్యార్థులు భూ భ్రమణం గురించి సులభంగా అర్థం చేసుకోవడానికి వీడియో రూపొందించాలని వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్లు అంగ్‌చుక్ పేర్కొన్నారు. లద్దాఖ్‌లోని విపరీతమైన శీతల పరిస్థితులు ఉండడం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్‌ పని చేయకపోవడం వంటి ఎదురుదెబ్బలు తగిలాయని.. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకువెళ్లానని అన్నారు.



Next Story

Most Viewed