Trending: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. యువకుడిని కొడుతూ చిత్రహింసలు (వీడియో)

by Shiva |   ( Updated:2024-12-06 03:44:03.0  )
Trending: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. యువకుడిని కొడుతూ చిత్రహింసలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగుల బలహీనతలను టార్గెట్‌గా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు భారీ మెసాలకు తెగబడుతున్నారు. తమకు డబ్బులిస్తే.. పెద్ద కంపెనీల్లో రూ.లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు శఠగోపం పెడుతున్నారు. తాజాగా, మరికొందరు ట్రాన్స్‌కో (Transco), ఆర్బీఐ (RBI) లాంటి సంస్థల్లో జాబ్‌లు ఉన్నాయంటూ అందినకాడికి దండుకుని బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా, శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ (Indian Army Calling Organization) ఆర్మీ (Army), నేవీ (Nevi), ఎయిర్‌ఫోర్స్‌ (Airforce)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు దండుకుంది. ఒక్కొక్కరి దగ్గర సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి బాధితులకు నరకం చూపిస్తోంది.

తాజాగా, తమకు జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ (Indian Army Calling Organization) ఫౌండర్ బసవ రమణ (Basava Ramana) విచక్షణరహితంగా దాడికి దిగాడు. ఓ ప్లాస్టిక్ వైర్‌ను చేతిలో పట్టుకుని సదరు యువకుడిని గొడ్డులా బాదాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు డబ్బులు బసవ రమణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


👉Click Here For Video!


Advertisement

Next Story

Most Viewed