Viral video: ఇది కదా బాల్యం అంటే.. ఇంటర్నెట్ లేని రోజుల్ని గుర్తుచేస్తున్న వీడియో!

by D.Reddy |   ( Updated:2025-04-16 11:42:47.0  )
Viral video: ఇది కదా బాల్యం అంటే.. ఇంటర్నెట్ లేని రోజుల్ని గుర్తుచేస్తున్న వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: బాల్యం (childhood) ప్రతి ఒక్కరికీ ఓ మధురానుభూతి. బరువులు, బాధ్యతలు, భయాలు లేని ఒక సుందర స్వప్నం. ఆటపాటలతో సరదా సంతోషాలతో కేరింతలు కొట్టే అందమైన జ్ఞాపకం (Beautiful memory). తిరిగి రాదని తెలిసినా.. వస్తే బాగుండని కోరుకునే తీరని కోరిక ఏదైనా ఉంటుందంటే అది కేవలం బాల్యం మాత్రమే. కానీ, అవన్నీ ఒక్కప్పుడు.. ఈనాటి బాల్యానికి ఇవేవి వర్తించవు. ఎందుకంటే.. నేటి తరం పిల్లలకు ఆటలంటే ఏసీ రూముల్లో కూర్చుని స్మార్ట్ ఫోన్లలో (Smart phones) గేమ్స్ మాత్రమే. చిన్నారులపై ఇంటర్నెట్ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. గంటల తరబడి సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. సెలవులు వచ్చాయంటే మైదానంలో ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు స్మార్ట్‌ ఫోన్లలో బందీగా మారుతున్నారు. మన చిన్నతనంలో అమ్మమ్మలు, నాన్నమ్మలు 'మా రోజుల్లో అని చెప్పినట్లుగా'.. ఇంటర్నెట్ లేని రోజుల్లో (Childhood before the internet) అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో (Social media) ఓ వీడియో నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో చూస్తుంటే ఇంటర్నెట్ లేని రోజుల్లో పిల్లలు ఎలా ఉండేవారో తెలియజేస్తుంది.

చిన్న ప్పుడు ప్రతి ఒక్కరు ఆడిన ఆటలో జారుడు బండ గుర్తుండే ఉంటుంది. ఇంటి దగ్గరేకానీ, మన పాఠశాలలో జారుడు బండ లాంటిది కనిపిస్తే చాలు వెళ్లి దానిపై నుంచి జారుతూ స్నేహితులతో సరదాగా గడిపేవాళ్లం. తాజాగా నెట్టింట వైరల్ అవతున్న వీడియోలో అక్క, తమ్ముడు ఇద్దరు కలిసి జారుడు బండ కోసం సిద్దం చేసుకున్నారు. బకెట్‌లో నీరు తీసుకొచ్చి వాలుగా ఉన్న నేలపై పోశారు. బురద నేల కావటంతో వారు జారేందుకు సిద్ధమైంది. ఇక అంతే ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు సరదా ఆడుకుంటూ కనిపించారు. ఈ దృశ్యాలను వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైఫ్ బిఫోర్ ఇంటర్నెట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed