Viral: వ్యక్తి బతికుండగానే పూడ్చేసి గోతి పక్కన కూర్చుని వీడియో.. చివరకు ఏం జరిగిందంటే?

by Hamsa |
Viral: వ్యక్తి బతికుండగానే పూడ్చేసి గోతి పక్కన కూర్చుని వీడియో.. చివరకు ఏం జరిగిందంటే?
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలామంది పొట్ట నింపు కోవడం కోసం రోడ్లపై కొందరు వివిధ విన్యాసాలు చేస్తూ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. కొందరు మాత్రం తాము ఫేమస్ అవ్వాలనే ఆలోచనతో సోషల్ మీడియా వేదికగా ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజెంట్ ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ క్రమంలో.. తాజాగా, ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతూ.. అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఓ ముగ్గురు వ్యక్తులు చేసిన పనికి నెట్టింట చర్చకు దారితీసింది.

అసలు వీడియోలో ఏముందంటే.. ఇద్దరు పురుషులు, ఓ మహిళ కలిసి గోతి తీశారు. అందులో ఓ వ్యక్తి నల్ల క్లాత్ కళ్ళకు కట్టుకుని ఉండగా.. మిగతా ఇద్దరు గోతిలో కాళ్లు బయటకు ఉంచి అతడి సగం శరీరాన్ని పూడ్చిపెట్టారు. అతను కాసేపు అలాగే ఉండి కాళ్లు కదిలిస్తున్నాడు. ఆ ఇద్దరు మాత్రం గోతికి రెండు వైపులా కూర్చొని దండం పెడతారు. అంతటితో వీడియో ముగుస్తుంది. అయితే కాసేపటికి అతన్ని బయటకు తీసినట్లు అర్థమవుతోంది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరూ చేయొద్దు అని అంటున్నారు. అలాగే డబ్బుల కోసం ఇలా చేయడం ప్రాణాలకు ప్రమాదం అని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story