- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మానవత్వంతో చింపాంజీ దాహం తీర్చిన వ్యక్తి.. అందుకు చింపాంజీ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా.. (వీడియో)
దిశ వెబ్ డెస్క్: ఈ భూమి మీద అత్యంత తెలివైన ప్రాణి మనిషి. అయితే దాదాపు మనిషిలానే ఆలోచించే జంతువులు సైతం ఈ భూమిపైన ఉన్నాయి. కాగా జ్ఞానమున్న జంతువుల్లో చింపాంజీ కూడా ఒకటి. అయితే సాదారణంగా చింపాజీని చేస్తేనే మనుషులు ఆమడ దూరం పారిపోతారు. అది ఎక్కడ కరుస్తుందో అనే భయంతో పరుగులు తీస్తారు.
అయితే చిపాంజీ దాడి చేస్తుందని మనం ఎంత భయపడతామో, దానికి ఎక్కడ హాని తలపెడతామో అని అది కూడా అంతే భయపడుతుంది. దీనితో ప్రాణ రక్షణ కోసం అది దాడి చేస్తుంది. అయితే ఈ లోకంలో మానవత్వం చాలా గొప్పది. ముఖ్యంగా మూగ జీవులపై రవ్వంత కరుణ చూపిస్తే చాలు అవి మనపై కొండంత ప్రేమను చూపిస్తాయి అని అనడానికి ఓ వ్యక్తి పట్ల చింపాంజీ చూపించిన కృతజ్ఞతా భావమే ఉదాహరణ.
వివరాల్లోకి వెళ్తే.. ఓ చింపాంజీ దాహంతో అలమటిస్తోంది. అయితే దాని ముందే ఓ నీటి మడుగు ఉంది. కాని అనివార్య కారణాలతో అది నీళ్లు తాగలేక పోయింది. కాగా అదే సమయంలో అక్కడకి వచ్చారు. చింపాంజీ అతని చేయి పట్టుకుని మడుగు వద్దకు తీసుకు వెళ్లింది. అనంతరం అ వ్యక్తి చేతులు ఉపయోగించుకుని తన దాహం తీర్చుకుంది. ఆ తరువాత తన ఎంగిలి అ వ్యక్తి చేతికి అంటుకుని ఉంటుందని భావించిన చింపాంజీ నీటితో అతని చేయి కడిగింది.
కాగా ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ చింపాంజీ తెలివికి ఫిదా అవుతున్నారు. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.