Viral Video: ఎన్నికల ప్రచారంలో షారుఖ్ ఖాన్.. కట్ చేస్తే..? (వీడియో)

by Indraja |   ( Updated:2024-04-19 13:07:52.0  )
Viral Video: ఎన్నికల ప్రచారంలో షారుఖ్ ఖాన్.. కట్ చేస్తే..? (వీడియో)
X

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అడుగులేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ప్రజలను ఆకర్షించేందుకు పలు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిమాన సినీ నటులు ప్రచారం చేస్తే ఓట్లు పడతాయని భావిస్తున్నాయి కొన్ని పార్టీలు.

సినీ నటులతో కూడా ప్రచారం చేయిస్తున్నాయి. తాజాగా ఇండియా కూటమి కూడా ఇదే పని చేసింది. బాలీవుడ్ రొమాంటిక్ లవర్ బాయ్‌ షారుఖ్ ఖాన్‌న్ని ఎన్నికల ప్రచారంలోకి దింపింది. ఇందులో వింతేముంది అన్నీ పార్టీ మాదిరిగానే ఇండియా కూటమి కూడా స్టార్ హీరోతో ప్రచారం చేయిస్తోంది అంతేకదా అనుకుంటే పొరపాటు.

ఎందుకంటే ఇండియా కూటమి తరుపున ప్రచారంలో పాల్గొంది షారుఖ్ ఖాన్ కాదు. షారుఖ్ ఖాన్ డూప్‌తో ప్రచారం చేయించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని సోలాపూర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణితి షిండే ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కి విపరీతమైన క్రేజ్ ఉంది.

ఈ నేపథ్యంలో ప్రణితి షిండేకి స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మద్దతు ఇస్తున్నారని తెలిసేలా ఆయనతో ఇండియా కూటమి తరుపున ప్రచారం చేయిస్తే ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో షారుఖ్ ఖాన్‌తో రోడ్డు షోలు నిర్వహించాలి అని అనుకుంది. అయితే ఏమైందో తెలీదుకానీ షారుఖ్ ఖాన్‌ను ప్రచారానికి పిలవకుండా ఆయన డూప్‌తో రోడ్డు షోలు నిర్వహించింది.

Advertisement

Next Story