Viral News: భరణం విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. ఏంటంటే..?

by Indraja |
Viral News: భరణం విషయంలో హైకోర్టు సంచలన తీర్పు.. ఏంటంటే..?
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇప్పటి వరకు విడాకులు తీసుకున్న భార్యాభర్తల్లో భర్త భార్యకు భరణం చెల్లిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి నుండి భార్య భర్తకు భరణం చెల్లించాలి అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. భరణం విషయంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించే మహిళ ఏ కారణం చేతనైనా భర్తనుండి విడాకులు తీసుకున్న నేపథ్యంలో.. ఆ భర్త అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులను ఎదుర్కుంటూ జీవనోపాధి పొందలేని స్థితిలో ఉంటే.. విడాకులు తీసుకున్న మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించాలని బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

బ్యాంకు మేనేజర్‌‌‌ గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించలేనని బాంబే హైకోర్టులో పిటీషన్ వేయగా.. ఆ పిటీషన్ ను కొట్టేస్తూ.. ఆయనకు నెలకు రూ/ 10 వేలు చెల్లించాలని బాంబే హైకోర్టు పేర్కొంది.

Advertisement

Next Story