‘వీడికి భూమ్మీద నూకలు కాదు.. బాస్మతి రైస్ ఉన్నట్లున్నయ్’ (వీడియో)

by Gantepaka Srikanth |
‘వీడికి భూమ్మీద నూకలు కాదు.. బాస్మతి రైస్ ఉన్నట్లున్నయ్’ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదా(Road Accidents)ల్లో కొన్నిసార్లు వింతలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఘటనల్లో స్వల్ప ప్రమాదాలతోనే కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొన్ని ఘటనల్లో వాహనం నుజ్జు నుజ్జు అయినా చిన్న మరక కూడా అంటకుండా సురక్షితంగా బయటపడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తిపై బైకుపై వెళ్తుండగా.. సడన్‌గా డివైడర్‌(Divider)ను ఢీకొట్టి.. అమాంతం గాల్లోకి ఎగిగి.. రోడ్డు ఎడమ వైపు నుంచి వెళుతున్న టాటాఏసీ వాహనం పైన పడతాడు. అయినా ఎలాంటి చిన్న గాయం కూడా కాకుండా.. వచ్చి అతని బైకును, అతనే లేపుకొని వెళ్లిపోయాడు. ఇదంతా గమనించిన వాహనదారులు ‘వీడికి భూమ్మీద నూకలు కాదు.. ఏకంగా బాస్మతి రైసే ఉన్నట్లున్నయ్.. బాలయ్య సినిమాలో కూడా ఇలాంటి సీన్ చూడలేదు’ అని అవాక్కయ్యారు. అక్కడే ఉన్న మరికొందరు ఈ స్టంట్ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది గమనించిన నెటిజన్లు ‘రియల్ స్టంట్ మాన్(Real Stunt Man).. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story