- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 ఏళ్ల వరుడు.. 102 ఏళ్ల వధువు.. 9 సంవత్సరాలు డేటింగ్ తర్వాత పెళ్లి..
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రేమ కథలను చూస్తూ ఉంటాం. అయితే వాటిలో కొన్ని సక్సెస్ అయిన స్టోరీలు ఉంటే, మరికొన్ని ఫెయిల్యూర్ స్టోరీలు ఉన్నాయి. కొన్ని జంటలు ప్రేమించి సక్సెస్ ఫుల్ గా వివాహం చేసుకుంటే మరికొంతమంది ప్రేమించిన వారి కోసం ఏండ్లుగా ఎదురుచూస్తుంటారు. అలాగే కొన్ని ప్రేమ కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని ప్రేమ కథలను వింటే చాలు అందరూ ఆశ్చర్యపోతుంటారు. అంటాంటి ఒక లవ్ స్టోరీ నే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రేమ జంట జీవితంలో చివరి దశలో పెళ్లి చేసుకుని వారి ప్రేమను కాపాడుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు.
బెర్నీ లిట్‌మాన్ మనవరాలు సారా లిట్‌మాన్ తన తాత పెళ్లి చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేసినట్లు యూదు క్రానికల్ నివేదిక తర్వాత విషయం చర్చలోకి వచ్చింది. ఈ నిర్ణయంతో అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ వారి జంటను చూసిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారు. మే 19న వివాహం చేసుకున్న తర్వాత, వారు వివాహ రిజిస్ట్రేషన్ కూడా చేశారు. 100 ఏళ్ల బెర్నీ లిట్‌మాన్ తన చివరి రోజుల్లో 102 ఏళ్ల మార్జోరీ ఫుటర్‌మాన్‌ను వివాహం చేసుకున్నాడు.
ఈ జంట గత 9 సంవత్సరాలుగా డేటింగ్ లో ఉన్నారు. లిట్‌మన్ మనవరాలు సారా లిట్‌మన్ మీడియాతో మాట్లాడుతూ మా తాతకి తోడుగా జీవించడానికి ఒకరు ఉన్నందుకు మేము నిజంగా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఈ వివాహంతో వారు పెద్ద వధూవరులయ్యారు. తన వివాహానికి సంబంధించి లిట్‌మాన్ మాట్లాడుతూ మేము ఒకే భవనంలో నివసించేవాల్లమని, వారిద్దరు పాత పద్ధతులను ఇష్టపడతామని తెలిపారు.
ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వారు ఆధునిక డేటింగ్ యాప్‌లకు బదులుగా సాంప్రదాయ పద్ధతిని కొనసాగించామని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం మార్జోరీ ఫుటర్‌మాన్, బెర్నీ లిట్‌మాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వధూవరులుగా మారారు. ఇంతకుముందు ఈ రికార్డు 2015లో వివాహం చేసుకున్న డోరీన్, జార్జ్ కిర్బీ పేరిట ఉంది.