Soundarya Death : మోహన్ బాబు తప్పేం లేదు : సౌందర్య భర్త

by M.Rajitha |   ( Updated:2025-03-12 14:50:46.0  )
Soundarya Death : మోహన్ బాబు తప్పేం లేదు : సౌందర్య భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ సౌందర్య మరణం(Soundarya Death) ఘటన తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. నటుడు మోహన్ బాబు(Mohan Babu) వలనే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కలెక్టర్ కు, పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. శంషాబాద్ లోని ఓ స్థలం అమ్మడానికి ఆమె నిరాకరించడంతో మోహన్ బాబే 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలో ఓ పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య, ఆమె సోదరుడి హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Accident) రూపంలో హత్య చేయించాడని, సాక్ష్యాలు దొరకకుండా చేశాడని, ఆ తర్వాత జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సౌందర్య భర్త రఘు(Raghu) స్పందించారు.

గత కొద్ది రోజులుగా హైదరాబాదు(Hyderabad)లోని ఒక ప్రాపర్టీకి సంబంధించి మోహన్ బాబు సౌందర్య పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారని, ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఆధారాలు లేని వార్తలని తెలిపారు. నా భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు స్వాధీనం చేసుకోలేదని అన్నారు. ఆయనకు, మాకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు కూడా లేవని, సౌందర్య మరణించిన తర్వాత కూడా నాకు మోహన్ బాబు గారితో 25 సంవత్సరాల పైనుంచి మంచి స్నేహం ఉందన్నారు. దయచేసి ఇలాంటివన్నీ ప్రచురించకండి అంటూ ఆయన ఒక లేఖ విడుదల చేశారు.

READ MORE ...

CM Revanth Reddy: సీఎంను కలిసిన మంచు విష్ణు.. ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్


Next Story