- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరుత పులి తోకపట్టుకు లాగిన వ్యక్తి.. ఆ తర్వాత..?! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః కుక్క తోక పట్టుకోవచ్చేమో కానీ పులితోక పట్టుకోవడం అంటే ప్రాణాలతో చెలగాటం అడటమే! అయితే, ఓ వ్యక్తి చిరుతపులిని తోక పట్టి లాగుతున్న షాకింగ్ వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 20 సెకన్ల క్లిప్‌లో, ఒక వ్యక్తి చిరుతపులిని తోక, దాని వెనుక కాళ్ళను పట్టుకుని లాగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఆశ్చర్యకరంగా ఈ చిరుత పులి ఆ వ్యక్తి బారి నుండి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ అసాధారణ ఘటనలో కొందరు వ్యక్తులు చుట్టూ చేరి, ఫొటోలు, వీడియోలూ తీస్తుంటారు. ఇక, పర్వీన్ కస్వాన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. అడవి జంతువులతో ఈ విధంగా ప్రవర్తించకూడదని నొక్కిచెప్పారు. ఆయన ఈ వీడియో చిత్రీకరించిన ప్రదేశాన్ని పేర్కొనలేదు. అయితే, "వన్యప్రాణులు మనకు స్నేహితుల వంటివని, వాటిని నియంత్రిండానికి కానీ, లేదా చికిత్స చేయడానికి కానీ, ఇది మార్గం కాదు. అవి కూడా జీవులు. జాగ్రత్తగా ఉండండి," అని రాశారు. కాగా, చివరికి ఈ చిరుతపులి చనిపోయిందని వీడియోలోని టెక్స్ట్ పేర్కొంది. ఇక, చిరుతపులిపై ఆ వీడియోలో వ్యక్తి ఇలా ప్రవర్తించడం చూసి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.