ఈ ఫోన్ నెంబర్ వాడితే మరణించడం ఖాయం.. ఒక్కసారి చెక్ చేసుకోండి!

by Disha Web Desk 6 |
ఈ ఫోన్ నెంబర్ వాడితే మరణించడం ఖాయం.. ఒక్కసారి చెక్ చేసుకోండి!
X

దిశ, ఫీచర్స్: స్మార్ట్ ఫోన్ లేని వారంటూ ఎవరూ లేరు. చిన్నా పెద్ద అంతా మొబైల్‌ను విచ్చల విడిగా వాడుతూ తెలియని విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే కొందరు ఫ్యాన్సీ నెంబర్లను తీసుకుంటూ ఒక్కరే రెండు, మూడు వాడుతుంటారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో కూడా పడుతుంటారు. తాజాగా, ఓ వింత సంఘటనకు సంబంధించిన విషయాలు బయటకు రావడంతో అంతా భయాందోళనకు గురవుతున్నారు. బల్గేరియాలో ఒక ఫోన్ నెంబర్ వాడిన వారంతా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

దీంతో అక్కడి ప్రభుత్వం ఆ ఫోన్ నెంబర్ వాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. బల్గేరియాకు చెందిన ఫోన్ కంపెనీ మోబి టెల్ సీఈఓ వ్లాదిమర్ గ్రాష్నోవ్ అనే వ్యక్తి 2001లో తీసుకున్నాడు. ఆయనకు క్యాన్సర్ రావడంతో మరణించాడు. అసలు అతనికి క్యాన్సర్ లేకున్నా ఈ నెంబర్ తీసుకున్నాక రేడియో పాయిజనింగ్ వల్ల చనిపోయాడు. ఆ తర్వాత 20023లో కోన్‌స్టాన్టిన్ డిమిట్రోవ్ అనే వ్యక్తి తీసుకున్నాడు. ఆ తర్వాత ఊహించని విధంగా కాల్పుల్లో మృతి చెందినట్లు సమాచారం. డిష్లీవ్ అనే వ్యాపారవేత్త ఈ నెంబర్ వాడి ఇండియన్ రెస్టారెంట్‌లో హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఆ నెంబర్ ఏంటంటే.. ‘‘+359888888888’’ ఇదొక ఫ్యాన్సీ నెంబర్ అని తెలుస్తోంది. కానీ అది వాడిన తర్వాత జనాలు ఎందుకు చనిపోయారనే విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంలో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Next Story

Most Viewed