- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral News:రాత్రికి రాత్రే వెలిసిన గుడి.. కట్టినవారెవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో దెవుడు, దెయ్యాలను నమ్మేవారి సంఖ్య తగ్గుతుందనడంలో ఆశ్చర్యం లేదు. అయితే కొందరు దేవుడు ఉన్నారని విశ్వసిస్తారు. మరికొందరు సైన్స్ నమ్ముతారు. ఇక దేవుడు ఉన్నాడని నమ్మిన వారు దెయ్యాలు ఉన్నాయని కూడా నమ్ముతారు. మన దేశంలో ఎన్నో మహిమ గల దేవాలయాలు ఉన్నాయి. వాటి వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర దాగి ఉంది. సైన్స్ కు అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అయితే ఓ ఆలయాన్ని రాత్రికి రాత్రే దెయ్యాలు కట్టించాయట. ఈ మాట విన్న వారిలో.. దెయ్యాలు నిజంగా ఉన్నాయా? దేవుడికి దెయ్యాలకు పడదు కదా? అయినా వాటికి గుడి కట్టించాల్సిన పనేంటి? అసలు ఆ గుడి ఎక్కడుంది? అని పలు సందేహాలు కలుగుతాయి. దీని గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
భారతదేశంలోని మధ్యప్రదేశ్ నడిబొడ్డున ఓ పురాతన శివాలయం ఉంది. దాని పేరు కాకన్మఠ్ దేవాలయం. ఈ ఆలయాన్ని దెయ్యాలు కట్టాయని చరిత్ర చెబుతుంది. ఇది 11వ శతాబ్దపు కచ్ఛపఘాట పాలకుడు కీర్తి రాజా ఆధ్వర్యంలో నిర్మించబడింది. అయితే ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆలయం ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు అండ్ చరిత్రకారులలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ టెంపుల్ సిమెంట్ లేకుండా రాళ్లతో అసాధారణంగా నిర్మించి ఉంటుంది. అంతేకాకుండా దీని నుంచి ప్రతి ధ్వనులు వినిపిస్తాయి.
స్థానిక జానపద కథల ప్రకారం.. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈ గుడిని దెయ్యాలు ఒకే రాత్రిలో నిర్మించాయని చెబుతుంటారు. అంతేకాకుండా తెల్లవారు జాము వరకు నిర్మాణం పూర్తి కాకపోవడంతో.. దెయ్యాలు ఆ నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశేయాని అంటుంటారు. అందుకే ఆ ఆలయం అసంపూర్తిగా ఉంటుందని వారు విశ్వసిస్తారు. ఈ ఆలయం భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీచినప్పుడు కూలిపోతుందా అన్నట్లు కనిపిస్తుంది. కానీ ఈ ఆలయం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ ఆలయం చుట్టూ నాలుగు అనుబంధ దేవాలయాలు ఉండేదంట. కానీ ప్రస్తుతం మధ్య దేవాలయం యొక్క అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.