పదేళ్ల వయసులో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్ అవ్వడానికి కారణం ఇదే?

by Disha Web Desk 9 |
పదేళ్ల వయసులో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. 62 ఏళ్ల వయసులో డిశ్చార్జ్ అవ్వడానికి కారణం ఇదే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవరైనా సరే హెల్త్ బాగోలేకపోతే ఆసుపత్రిలో నాలుగైదు రోజులు ఉంటారు. ఆరోగ్యం మరింత క్షీణించినట్లైతే నెల, రెండు నెలలు ఉంటారు. ఇక తీవ్రమైన సమస్య లేదు ఆరోగ్యం బాగుంది.. అంతా ఓకే అన్నప్పుడు డాక్టర్లు, పెషేంట్‌ను డిశ్చార్జ్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి హెల్త్ బాగున్నా కూడా ఆసుపత్రిలో తలుపులు మూసి వెనక దాదాపు 50 ఏళ్లకు పైగా గడిపాడు. వివరాల్లోకెళ్తే.. చార్లెస్ (62)అనే వ్యక్తి పదేళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరాడు. కొన్ని రోజులకే అతడి ఆరోగ్యం బాగుపడింది. అయినా కూడా చార్లెస్ ఆసుపత్రి బెడ్‌పైనే పడుకుని గడిపాడట. అయితే అతడికి తన జీవితం అస్సలు నచ్చలేదని, చార్లెస్‌ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డానని తన సోదరి మార్గో వెల్లడించింది. ఇక చివరకు తనకు 62 ఏళ్ల వయసులో ఆసుపత్రి నుంచి బయటకొచ్చాడని చెప్పుకొచ్చింది. చార్లెస్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్లగలనని ధైర్యంగా చెబుతున్నాడు. నాకు చేపలు, చిప్స్ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇప్పుడు బయటకు రావడం బాగుంది. ఇంతకు ముందు ఫ్రీడమ్ లేదని అన్నాడు.

Next Story

Most Viewed