- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral News: పెళ్లి కాకుండానే 100 మందికి పైగా పిల్లలకు తండ్రినయ్యా.. టెలిగ్రాం సీఈవో సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: తనకు పెళ్లి కాకుండానే 100 మందికి పైగా పిల్లలకు తండ్రిని అయ్యానని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ప్రకటించారు. అంతేగాక వీరంతా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఉన్నారని స్వయంగా వెల్లడించారు. దీంతో పావెల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇండియాలో ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈఓ పావెల్ దురోవ్ తన టెలిగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అందులో తానకు ఇంకా పెళ్లి కాలేదు అని, కానీ 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్ గా తండ్రినయ్యానని తెలిపాడు. 15 ఏళ్ల క్రితం తన స్నేహితుడు తనని కలిసి ఓ వింత సాయం కోరాడని తెలిపాడు. తనకు పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం వీర్యదానం చేయాలని అడిగాడని, ఇది విని విపరీతంగా నవ్వుకున్నా.. కానీ ఇది ఎంత పెద్ద సమస్యో తర్వాత అర్ధమైందని అన్నాడు.
ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసేవారు చాలా తక్కువమంది ఉన్నారని, వీర్యాన్ని దానం చేసి దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యత అని ఓ డాక్టర్ తనతో అన్నాడని తెలిపాడు. దీంతో తాను స్పెర్మ్ డొనేషన్ లో రిజిస్టర్ చేసుకున్నానని, అలా ఇప్పటివరకు 12 దేశాల్లో వందమందికి పైగా సంతాన ప్రాప్తి కలిగించినట్లు వివరించాడు. వీర్య దానాన్ని ఆపేసి చాలా రోజులు అయినా.. ఫ్రీజ్ చేసిన వీర్యం ద్వారా ఇప్పటికీ ఎంతో మంది దంపతులు సంతానం పొందుతున్నట్లు తెలుసుకున్నానని అన్నాడు. స్పెర్మ్ డొనర్ అయినందుకు పశ్చత్తాపం లేదని, సంతానలేమి సమస్య ఉన్న ఇంట ఆనందం నింపినందుకు గర్వపడుతున్నానని తెలిపాడు. అంతేగాక వీర్య దానానికి ప్రతిఒక్కరు ముందుకు రావాలని పావెల్ దురోవ్ కోరారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై టెలిగ్రాం సీఈవో వ్యాఖ్యలను నెటిజన్లు సమర్థిస్తున్నారు. అంతేగాక కంగ్రాట్స్ పావెల్ అని ఫన్నీగా స్పందిస్తున్నారు.