- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Elon Musk: ఎక్స్‌పై సైబర్ దాడి! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలపై దుమారం

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ (X) సేవలు సోమవారం మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా మరోసారి నిలిచిపోయిన విషయం తెలిసిందే. సైట్ ఓపెన్ కావడం లేదు. లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. అంతరాయంపై ఎక్స్ యజమాని, దిగ్గజ వ్యాపారవేత్త (Elon Musk) ఎలాన్ మస్క్ స్పందించారు. ఆయన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఎక్స్' సైబర్ దాడి (Cyber Attack)కి గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లు (Ukraine) ఉక్రెయిన్ దేశం నుంచి ఉన్నట్లు గుర్తించామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ మాట్లాడిన వీడియోలు తాజాగా నెట్టింట దుమారం రేపాయి. ఉక్రెయిన్ ఐపీల నుంచి సైబర్ దాడి జరిగినట్లు ఆధారాలు చూపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఎక్స్ సేవలకు అంతరాయం కేవలం వారి సాంకేతిక లోపం అని, ఎలాన్ మస్క్ చెప్పే మాటలు అబద్దాలు చెబుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఒక్క రోజులోనే మూడు సార్లు ఎక్స్ సేవలకు అంతరాయం కలిగింది. అమెరికా, ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రధాన దేశాల్లో ఈ అంతరాయం తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో పలువురు ఎక్స్‌ను యాక్సెస్ చేసుకోలేకపోయారు. 56 శాతం మంది యాప్ యూజర్లు, వెబ్‌సైట్ వాడుతున్న వారిలో 33 శాతం మంది ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలు నివేదికలు తెలిపాయి.