Viral News: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? కెనడా పరిశోధనల్లో నమ్మలేని నిజాలు..

by Indraja |
Viral News: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? కెనడా పరిశోధనల్లో నమ్మలేని నిజాలు..
X

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం మనిషి జీవితంలో సెల్ ఫోన్ ఒక బభాగమైపోయింది. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి ఫోన్ లోనే కాలం గడుపుతున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలు అల్లరి చెయ్యకుండా వాళ్ళ చేతిలో తల్లిదండ్రులు సెల్ ఫోన్ పెడుతున్నారు. దీనితో చాలా మంది పిల్లలు ఫోన్ కు బానిసలైపోతున్నారు.

అయితే స్మార్ట్ ఫోన్ వాడే పిల్లలు మానసిక వ్యాధులకు గురవుతారని పరిశోధనల్లో తేలిందని నిపుణలు పేర్కొంటున్నారు. సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్ కి బానిసలు అయిన పిల్లలకు 23 ఏళ్ళు వయసు వచ్చేసరికి బ్రమ కలగడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయని కెనడా పరిశోధకులు వెల్లడించారు.

ముఖ్యంగా టీనేజ్ లో వీడియో గేమ్స్ కి, మొబైల్ కి బానిసలు అయితే ఈ వ్యాధులు వచ్చే అవకాశం 3-7% ఎక్కువగా ఉన్నటుందని వెల్లడించారు. అలానే స్మార్ట్ ఫోన్ ల వినియోగం తగ్గించకపోతే తలిదండ్రులకు పిల్లలకు మధ్య బంధం కూడా దెబ్బతింటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story