BREAKING: బ్రిటానియా బిస్కెట్ కంపెనీకి బిగ్ షాక్.. కస్టమర్ ఇచ్చిన ట్విస్ట్‌కు మైండ్ బ్లాంక్!

by Shiva |   ( Updated:2024-05-23 12:27:00.0  )
BREAKING: బ్రిటానియా బిస్కెట్ కంపెనీకి బిగ్ షాక్.. కస్టమర్ ఇచ్చిన ట్విస్ట్‌కు మైండ్ బ్లాంక్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: సాధారణంగా మనం బేకరీలు, షాపింగ్ మాల్‌లలో బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు చేస్తాం. ఆ వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసి తినేసి పడేస్తాం. కానీ, కేరళ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని వరక్కర ప్రాంతానికి చెందిన జార్జ్ థాటిల్ ఓ బేకరీలో డిసెంబర్ 4, 2019న రూ.40 పెట్టి ‘బ్రిటానియా న్యూట్రి ఛాయిస్' రెండు బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అయితే, ఆ బిస్కెట్ ప్యాకెట్ల బరువుపై జార్జ్ అనుమానం రాగా 300 గ్రాములు ఉండాల్సిన బిస్కెట్ ప్యాకెట్ 248 గ్రాములే ఉంది. దీంతో అతడు నేరుగా తునికలు, కొలతల శాఖకు వెళ్లి బరువు మరోసారి చెక్ చేయించగా 248 గ్రాములే ఉన్నట్లుగా నిర్ధారణ అయింది

అనంతరం వినియోగదారుడు జార్జ్ నిర్ధారించిన బరువు కంటే తక్కువ బరువున్న బస్కెట్లను మార్కెట్లో విక్రయిస్తారని త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాదోపవాదాలు దాదాపు విన్న కోర్టు నాలుగున్నరేళ్ల అనంతరం తుది తీర్పును వెలువరించింది. తక్కువ బరువు ఉన్న బిస్కెట్ ప్యాకెట్ అమ్మినందుకు గాను జార్జ్ థాటిల్‌కు రూ.60 వేలు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోసారి ఇలాంటి ఘటలను రిపీట్ కావొద్దంటూ బిటానియా కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించింది.

Advertisement

Next Story