గూడ్స్ రైలు కింద చిక్కుకోని.. 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.. ఎలా కాపాడారో తెలుసా?

by Ramesh N |   ( Updated:2024-04-22 12:25:24.0  )
గూడ్స్ రైలు కింద చిక్కుకోని.. 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.. ఎలా కాపాడారో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తర‌ప్రదేశ్‌లో ఓ బాలుడు గూడ్స్ రైలు చక్రాల మధ్య గ్యాప్‌లో కూర్చోని ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజగా నెట్టింట వైరల్ అయ్యింది. రైల్వే ట్రాక్ వద్ద నివాసం ఉంటున్న ఓ పిల్లాడు రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటూ.. ఆగి ఉన్న లక్నో నుంచి రోజా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కాడు. అనంతరం గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో బాలుడు కిందకి దిగలేకపోయాడు. దీంతో రైలు చక్రాల మధ్యలో ఉండే చిన్నపాటి గ్యాప్‌లో పిల్లాడు ప్రమాదకర స్థితిలో కూర్చోని ఉండిపోయాడు. అనంతరం యూపీలోని హర్దోయ్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు ఆగింది. ఈ క్రమంలోనే సిబ్బంది రైలును తనిఖీలు చేయగా బాలుడిని చూసి షాక్ అయ్యారు. ఆ బాలుడు భయపడుతూ కనిపించాడు. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా చక్రాల మధ్య గ్యాప్‌లో ఉన్న బాలుడిని బయటకు తీశారు.

విచారణలో పిల్లవాడి కుటుంబం లక్నో- అలంనగర్ రాజాజీపురంలోని బాలాజీ మందిర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలుడిని చైల్డ్ కేర్ హర్దోయ్‌కి అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బాలుడిని గుర్తించిన రైల్వే సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story