- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక్కడిపై 20 మంది దాడి.. అసలు గొడవ ఎక్కడ జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

దిశ, వెబ్ డెస్క్: 2023లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా 'పార్కింగ్' (Parking) దాదాపు అందరూ చూసే ఉంటారు. డైరెక్ట్ డిస్నీ+హాట్‌స్టార్‌లో (Disney+Hotstar) స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ఈ చిత్రంలో అద్దె ఇంట్లో నివాసముండే రెండు కుటుంబాల మధ్య కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వాగ్వాదం తారస్థాయికి ఎలా చేరింది? అనే విషయాన్ని దర్శకుడు చూపించాడు. అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
విజయవాడ సమీపంలో ఉన్న యనమలకుదురులోని శివపారత్వి నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో రబ్బానీ, వీరయ్య అనే వ్యక్తులు నివాసముంటున్నారు. అయితే, వీరి మధ్య పార్కింగ్ స్థానం విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా తారాస్థాయికి చేరింది. దీంతో రబ్బానీపై 20 మంది ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావటంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ మేరకు రబ్బానీ పోలీసులకు వీరయ్య, దాడికి పాల్పడ్డ వారిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.