- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు గంటల్లో రెండు మిలియన్ యూజర్లు.. థ్రెడ్స్ మైక్రోబ్లాగింగ్ యాప్ రికార్డు!
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ థ్రెడ్స్ యాప్ ను గురువారం నుండి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ను లాంచ్ చేసిన గంటల వ్యవధిలోనే భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం యూఎస్ లోనే ఈ యాప్ లాంచ్ అయింది. యాప్ ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో లాగిన్ అవ్వగా తొలి నాలుగు గంటల్లోనే ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. అయితే ఈ యాప్ ప్రభంజనం చూస్తుంటే ట్విట్టర్ ను మించిపోయేలా ఉందని టెక్ వర్గాల్లో చర్చ జరగుతున్నది. కాగా ఈ థ్రెడ్స్ యాప్ లాంచింగ్ నేపథ్యంలో మెటా అధినేత జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఉదయం ట్విట్టర్ లో పోస్ట్ చేయడం విశేషం.
ఇక ప్రత్యర్థి తీసుకువచ్చిన ఈ యాప్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ రియాక్ట్ అయ్యారు. థ్రెడ్స్ రూపకల్పనలో మెటా సంస్థ కేవలం కాపీ పేస్ట్ మాత్రమే చేసిందని ఓ నెటిజన్ చేసిన సెటైర్లు ఎలాన్ మస్క్ స్మైలీ ఎమోజీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ట్వీట్ లను వీక్షించే విషయంలో ఆ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ట్విట్టర్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్‌లను లాగిన్ లేకుండానే వీక్షించడానికి అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది.